పయనించే సూర్యుడు న్యూస్ :మే 28,తల్లాడ రిపోర్టర్ తల్లాడ మండల పరిధిలోని కుర్నవల్లి గ్రామానికి చెందిన ఇనపనూరి మరియమ్మ 58 బుధవారం ఉదయం ఆకస్మిక మృతి చెందింది. ఆమెకు భర్త పిల్లలు ఉన్నారు. ఆమె గత 20 సంవత్సరాలుగా మండల పరిధిలోని కుర్నవల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్మికురాలుగా పనిచేస్తూ విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందిస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల మన్ననలు పొందింది ఆమె మృతి పట్ల మధ్యాహ్న భోజన పథకం ఏఐటియుసి సంఘం రాష్ట్ర సమితి సభ్యులు నిమ్మటూరి రామకృష్ణ, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు వేము రాంబాబు ,మండల మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షురాలు ఇనపనూరి సాయమ్మ, ఎక్కిరాల మరియమ్మ, భవాని, పార్వతి ,ఆదూరి రావేలు, రాధ , లక్ష్మి తదితరులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆమె భౌతిక దేహమును సందర్శించి నివాళులర్పించి సంతాపాన్ని సానుభూతిని ప్రకటిస్తూ కుటుంబానికి మనోధార్యాన్ని ఇచ్చారు.