
పయనించే సూర్యుడు న్యూస్ నవంబర్ 3 అశ్వారావుపేట మండల రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కష్టాల్లో ఉన్న మిత్రుల కుటుంబాలకు అండగా నిలుస్తూ అశ్వారావుపేట జిల్లా పరిషత్ హైస్కూల్ జెడ్ పి హెచ్ ఎస్ 2004-2005 పదో తరగతి బ్యాచ్ మిత్రులు తమ ఐక్యతను, అపూర్వ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ఇటీవల అకాల మరణం చెందిన కేబుల్ ప్రసాద్ కుటుంబానికి ఆసరాగా నిలిచేందుకు ఆయన భార్య, తమ చిన్ననాటి స్నేహితురాలు ఆంటోనీకి మిత్రులందరూ కలిసి ఇప్పటివరకు 55,700 ఆర్థిక సాయాన్ని సేకరించారు. ఇందులో 50,000ను ఇప్పటికే ఆంటోనీకి నేరుగా అందజేశారు.
అలాగే, తమ క్లాస్మేట్ మాధురి మరణించి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఆమె కుటుంబానికి కూడా చేయూతనందించాలని గ్రూప్ సభ్యులు నిర్ణయించారు. మాధురి చిన్న పాప తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ అత్యవసరంగా హార్ట్ సర్జరీ చేయించుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో కేబుల్ ప్రసాద్ నిధిలో మిగిలిన 5,700ను పాప వైద్యం కోసం కేటాయించారు. మాధురి పాప హార్ట్ సర్జరీ ఖర్చుల నిమిత్తం మిత్రులందరూ తమవంతు ఆర్థిక సహాయ సహకారాలు అందించి, తమ ఎస్ ఎస్ సి గ్రూప్ ఐక్యతను మరోసారి చాటుకోవాలని 2004-2005 జెడ్ పి హెచ్ ఎస్ బ్యాచ్ మిత్రులు పిలుపునిచ్చారు.