తెలంగాణ ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్ గౌడ్ మృతికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మొహమ్మద్ మసూద్ సంతాపం.

🖨️ Print

పయనించే సూర్యుడు, నవంబర్ 3, బచ్చన్నపేట మండలం ప్రతినిధి: నిల పవన్. తెలంగాణ ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్ గౌడ్ ఉరివేసుకొని మృతి చెందడం పట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొహమ్మద్ మసూద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన భౌతికకాయానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మనోధైర్యాన్ని కల్పించారు. లక్ష్మణ్ గౌడ్ మృతి తెలంగాణ ఉద్యమానికి, స్థానిక ప్రాంతానికి తీరని లోటని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనగామ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, జిల్లా కార్యదర్శి దాతరపు నరేష్, కొన్నే గ్రామ శాఖ అధ్యక్షులు సిద్ధిరాములు, బాలకిషన్, నీల రమేష్, మల్లారెడ్డి, బాల్నే రమేష్, కరుణాకర్, ఇస్తారీ నజీర్, బొట్టు గణపతి గంగరబోయిన శ్రీను, బిక్షపతి, రంగు అశోక్, ఆగయ్య, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *