సింగరేణి మత్స్య సహకార సంఘం ఎన్నికలు ఏకగ్రీవం

రెండోసారి అధ్యక్షుడిగా తురక సాంబయ్య.. నూతన కార్యవర్గం ఎన్నిక
🖨️ Print

పయనించే సూర్యుడు న్యూస్ నవంబర్ 3 సింగరేణి రిపోర్టర్ నరేష్ సింగరేణి మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికలు సోమవారం ఏకగ్రీవంగా ముగిశాయి. సంఘం అధ్యక్షుడిగా తురక సాంబయ్య రెండోసారి ఎన్నికయ్యారు. సింగరేణి పెద్ద చెరువు కట్ట మైసమ్మ చింతచెట్టు వద్ద ఎన్నికల అధికారి జి. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల్లో 140 మంది సభ్యులు పాల్గొని నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా తురక కోటేశ్వరరావు, కార్యదర్శిగా చింతల సంపత్, డైరెక్టర్లుగా గిరిపోయిన వెంకన్న, బోళ్ల లచ్చయ్య, తురక రాజు, పేరున గురువులు, తురక లక్ష్మి, గంగారబోయిన జానకమ్మ ఎన్నికయ్యారు. రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తురక సాంబయ్యకు సభ్యులు అభినందనలు తెలిపారు. మత్స్యకారుల సంక్షేమం, సంఘం అభివృద్ధి, సభ్యుల హక్కుల పరిరక్షణకు నూతన కార్యవర్గం కృషి చేయాలని ఆకాంక్షించారు. సభ్యులందరినీ కలుపుకొని సంఘాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *