
పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం నవంబర్ 2 జగయ్యపేట్ట పట్టణంలోని సోమవారం నాడు జనసేన పార్టీ నాయకులు, కౌన్సిలర్ అభ్యర్థి కొలగాని రాము ఆధ్వర్యంలో ఆసుపత్రిలోని బాలింతలకు, రోగులకు పండ్లు, బ్రెడ్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాలింతలు, రోగుల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుని వారికి పండ్లు అందజేశారు._ ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. విమలభాను ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ, ఆపదలో ఉన్న ఎంతోమందికి అండగా నిలుస్తూ, నియోజకవర్గ ప్రజలకు సేవా హస్తాన్ని అందిస్తున్న సామినేని విమలభాను కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజాసేవే లక్ష్యంగా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడుతూ, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని, ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు.