తెలుగుదేశం పార్టీ ఏం చేసింది? ప్రజలు ఆలోచించి ఓటేయాలిజెడ్పీటీసీ , ఎంపీపీ, ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించండి…

మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డి.
🖨️ Print

పయనించే సూర్యుడు నవంబర్ 3 ఆదోని రూరల్ రిపోర్టర్. పెద్ద తుంబలం గ్రామీణ ప్రాంత ప్రజలతో సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, జడ్పిటిసి గా ఎం విజయలక్ష్మి ఎంపీపీగా కొండగౌని ముత్తమ్మ, ఎంపీటీసీ 1 డి సూర్పరాజు , ఎంపీటీసీ 2 మంచాల రెహనా వైయస్ఆర్సీపీ నుండి పోటీ చేస్తున్నారు వీరిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అలాగే తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఏం చేసిందో అని ప్రశ్నించాలని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు తమ ఓటుహక్కునువినియోగించుకుని ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రాజకీయంగా అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యత కల్పిస్తూ, ఆయా వర్గాల నాయకులు ఉన్నత స్థాయికి ఎదిగేందుకు తమ పార్టీ అవకాశం కల్పిస్తుందని తెలిపారు. గతంలో కొన్ని పొరపాట్లు జరిగినప్పటికీ, ప్రజల మద్దతుతో ముందుకు సాగుతామని పేర్కొన్నారు. రైతులు, విద్యార్థులు, యువత, పేదల సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. మండలానికి మెడికల్ కాలేజీ ఎంతో అవసరమని, మెరుగైన వైద్య సదుపాయాల కోసం ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు రెండు ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే మండల అభివృద్ధికి కృషి చేస్తామని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *