తాళ్లూరు సురేష్ గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారం జోరు!

ఎంపీటీసీ బరిలో ప్రజల మద్దతుతో విజయమే ధ్యేయంగా ప్రజాదరణ.. ప్రచారంలో దూకుడు! ప్రచారంలో భారీగా కూటమి నాయకులు, కార్యకర్తలు మహిళలు
🖨️ Print

పయనించే సూర్యడు న్యూస్ కుక్కునూరు నవంబర్ 2
స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా కుక్కునూరు మండలం శ్రీధర, వేలేరు, సీతారామ నగరం కూటమి టి డి పీ ఎంపీటీసీ అభ్యర్థి తాళ్లూరి సురేష్ ప్రచారంలో జోరు పెంచారు. సీతారామ నగరం గ్రామ పంచాయతీ లో విస్తృతంగా పర్యటిస్తూ ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకున్నారు. ఈ సందర్భంగా టిడిపి పార్టీ ఎన్నికల గుర్తు సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.గ్రామాల్లో నిర్వహించిన ప్రచార కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పార్టీ శ్రేణుల ఉత్సాహం మధ్య ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు ఈకార్యక్రమంలో కూటమి టిడిపి సీనియర్ నాయకులు,కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని పార్టీ శ్రేణుల సమిష్టి కృషితో ఎన్నికల ప్రచారాన్ని ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *