చింతూరులో అత్యంత ఘనంగా ‘మహానాడు’.. రికార్డు స్థాయిలో తరలివచ్చిన కార్యకర్తలు

JK గోదామ్ ఆవరణలో డిజిటల్ స్క్రీన్‌పై ప్రత్యక్ష ప్రసారం

పయనించే సూర్యుడు ప్రతినిధి జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ ఏప్రిల్ 28 పోలవరం జిల్లా చింతూరు తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మహానాడు కార్యక్రమం అత్యంత వైభవంగా, ఘనంగా నిర్వహించబడింది. చింతూరు మండల పార్టీ అధ్యక్షులు ఎండి జమాల్ ఖాన్ గారి ఆధ్వర్యంలో క్లస్టర్ ఇంచార్జ్ ఓ నర్సింహారావు నిమ్మలగూడెంలోని జెకె (JK) ట్రస్ట్ ఆవరణలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ మహానాడు మహోత్సవానికి మండలంలోని అన్ని గ్రామాల నుండి రికార్డు స్థాయిలో సుమారు 650 మందికి పైగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా తరలివచ్చారు. కార్యక్రమానికి విచ్చేసిన కార్యకర్తలకు డిజిటల్ పద్ధతిలో ఆన్‌లైన్ హాజరు నమోదు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన పెద్ద డిజిటల్ స్క్రీన్‌పై మహానాడు ఆన్‌లైన్ ప్రత్యక్ష ప్రసారాలను, అధినాయకత్వ ప్రసంగాలను నాయకులు, కార్యకర్తలు ఎంతో శ్రద్ధగా వీక్షించి, విన్నారు. కార్యకర్తల భారీ రాకతో ఆడిటోరియం ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది.కార్యక్రమానికి విచ్చేసిన కార్యకర్తలకు ఉదయం నుండి ఎండ తీవ్రత దృష్ట్యా దాహార్తిని తీర్చడానికి నిరంతరాయంగా మజ్జిగ పంపిణీ చేశారు. అనంతరం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో హాజరైన ప్రతి ఒక్కరికీ ఘనంగా తేనెటివిందు సౌకర్యాలు కల్పించారు.ఈ మహానాడు కార్యక్రమంలో చింతూరు మాజీ మండల అధ్యక్షులు. ఎండి జాంగిర్, ఇల్లా.చిన్నారెడ్డి, చింతూరు మండల ముఖ్య నాయకులు ఆసిఫ్, జానీ,శీలం తమ్మయ్య, మహిళా నాయకురాళ్లు, వివిధ గ్రామాల ప్రతినిధులు మరియు భారీ సంఖ్యలో తెలుగుదేశం పార్టీ యూనిట్ ఇంచార్జిలు,బూత్ ఇంచార్జిలు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *