అంగరంగ వైభవంగా మహానాడు ప్రారంభం

నూతన అధ్యాయానికి నాంది పలికిన డిజిటల్ మహానాడు.

పయనించే సూర్యుడు మే 28 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కార్యక్రమం ఘనంగా మహానాడు వేడుకలు కాట్రేనికోన, ఆంధ్రప్రభ ముమ్మిడివరం నియోజకవర్గంపరిధిలో క్లస్టర్ 4 చెయ్యేరు, కందికుప్ప గ్రామాల్లోమహానాడు వేడుకలు బుధవారంఘనంగా నిర్వహించారు. ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వర్చువల్ విధానంలో ఈ వేడుకలు జరిగాయి. మండలంలోని టిడిపి నాయకులు కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమాలకుపెద్ద ఎత్తున హాజరయ్యారు. పేదవాడు రాజకీయంలోకి ప్రవేశించడానికి అవకాశం కల్పించిన మహనీయుడు ఎన్టీఆర్ అని రాష్ట్ర మత్స్యశాఖ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగిడి నాగేశ్వరావు అన్నారు. క్రమశిక్షణకు మారుపేరుగా టిడిపి నిలుస్తుందనిమండల టిడిపి అధ్యక్షుడు చెల్లి సురేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, సీనియర్ నాయకులు నడింపల్లి సుబ్బరాజు , వాటర్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ ఆకాశంశ్రీనివాస్, త్స వట పల్లి నాగేంద్ర త్స వట పల్లి శ్రీనివాస్ శ్ విత్తనాల బుజ్జి, విత్తనాల వెంకటరమణ, గంగు మళ్ల భద్రరావు, గోకర కొండ సత్యనారాయణ మూర్తి, వనచర్ల నాగేశ్వరరావు, కాండ్రేకుల సత్య ప్రసాద్,మండల తెలుగు యువత అధ్యక్షుడు వంగదుర్గ బాబు, బండారు ఏసు,నల్లా రామకృష్ణ, గువ్వల సత్తిబాబు, పాకలపాటి త్రినాధ వర్మ ,పోలవరపు వెంకటరమణ, మట్టపర్తి సాయి, గుత్తుల సూరిబాబు ,మట్ట రమేష్ తదితరులు పాల్గొన్నారు.
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *