పయనించే సూర్యుడు మే 28 పాపన్నపేట మండల రిపోర్టర్ దుర్గాప్రసాద్ పాపన్నపేట మండలం లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గ భవాని మాతను ఎమ్మెల్యే రోహిత్ రావు,శివాని దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న వారికి అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు అమ్మవారి కృపతో అందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని వారు కోరుకున్నారు. వీరి వెంట మెదక్ మున్సిపల్ చైర్ పర్సన్ రాధిక, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నరేందర్ గౌడ్, సర్పంచుల ఫోరమ్ మండల అధ్యక్షుడు వెంకటేశం,నాయకులు .. భరత్ గౌడ్,ప్రసాద్ గౌడ్,ఖలీమ్,ఇంద్రాసేనా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.