పయణించే సూర్యుడు రిపోర్టర్ ఆదోని పట్టణంలోని అనంత మంగళా ఆంజనేయస్వామి దేవాలయ హాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి కర్నూలు జిల్లా విస్తృతస్థాయి సమావేశం ఘనంగా నిర్వహించబడింది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి రాష్ట్ర ఇంచార్జి పి. రామచంద్రయ్య, జిల్లా ఇంచార్జి పి. జగన్నాథం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు వి. వెంకట్రాముడు అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజానాట్య మండలి ఉద్యమం సమాజంలో సాంస్కృతిక చైతన్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. కళలు ప్రజల సమస్యలను ప్రతిబింబించే సాధనాలుగా ఉండాలని, సామాజిక బాధ్యతతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలను గ్రామీణ స్థాయి వరకు విస్తరించాల్సిన అవసరం ఉందని అన్నారు.జిల్లాలో ప్రజానాట్యమండలి కార్యకలాపాలను మరింత బలోపేతం చేయడం, యువతను సాంస్కృతిక రంగంలో భాగస్వామ్యం చేయడం, కళా బృందాలను గ్రామాల స్థాయిలో ఏర్పాటు చేయడం వంటి అంశాలపై సమావేశంలో చర్చించినట్లు తెలిపారు.అదేవిధంగా రాబోయే కాలంలో ప్రజా సమస్యలు, సామాజిక అంశాలపై సాంస్కృతిక కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి వి నాగరాజు జిల్లా కార్యవర్గ సభ్యులు తిమ్మ గురుడు, రఘు, వర్మ, ఉసేని సిపిఐ పట్టణ కార్యదర్శి టి.వీరేష్, కే. రమేష్ ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి పట్టణ నాయకులు కొత్తూరు ఈరన్న, డి హెచ్ పి ఎస్ పట్టణ కార్యదర్శి ఏ. విజయ్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజానాట్యమండలి నాయకులు, కళాకారులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.