పయనించే సూర్యుడు న్యూస్: పెద్దపల్లి,సెంటినరి కాలనీ-03 రామగిరి మండలంలో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి మండల అధ్యక్షుడు కొండు లక్ష్మణ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కొండు లక్ష్మణ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికి ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణలో అప్పుల కుంపటిగా మార్చిన ఘనత బిఆర్ఏస్ మరియు కాంగ్రెస్ ప్రభుత్వాలకి దక్కిందన్నారు. తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాలు దొరల గడీల పాలన చూసారని గత మూడేళ్ల నుండి నిజాం రాజుల పాలన తలపించే కాంగ్రెస్ ప్రభుత్వ పాలన చూస్తున్నారని ఆయన అన్నారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం వడ్లు మరియు మక్కలు కొనుగోలు చేయక రైతులను నానా ఇబ్బందులు పెడుతుందని కట్టింగుల రూపంలో దాదాపు ఒక ఎకరాకు రెండు నుండి మూడు క్వింటాళ్ల ధాన్యం కట్టింగ్ చేయడం ద్వారా రైతు ఒక ఎకరాకు 5000 నుండి 6000 రూపాయలు నష్టపోతుండు అని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు 420 హామీలను తుంగలో తొక్కి కేవలం కాలయాపన చేస్తుందని హైడ్రా పేరుతో పేద ఇండ్లుకూల్చడం మరియు తమ స్వలాభం కోసం ఇండస్ట్రియల్ పార్కుల పేరుతో రైతుల నుండి భూములను లాక్కోవడంలో ఉన్న శ్రద్ధ నియోజకవర్గాల మరియు రాష్ట్ర అభివృద్ధి మీద ఈ నాయకులకు ద్రుష్టి లేదని ఆయన అన్నారు. త్వరలోనే తెలంగాణలో రాక్షస పాలన అంతమై రామరాజ్యం ఏర్పడుతుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి తోట్ల రాజు, ఉపాధ్యక్షుడు నాంసాని మహేష్, కార్యదర్శి కొత్త కమలాకర్, ఓబీసీ అధ్యక్షుడు మైదానం సందీప్, బిజెపి నాయకులు సాయిరాం, ఆదిత్య, చందు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.