లోతట్టు నిర్వాసితులకు మంచినీరు అందించాలని సిపిఐ డిమాండ్

పయనించే సూర్యుడు: రిపోర్టర్ శ్రవణ్ రాజ్ అనకాపల్లి జిల్లా చోడవరం మండలం చోడవరం మేజర్ పంచాయతీలో మంచినీరుకి విలవిల్లాడుతున్న సంతకి వీధి నివాసితులు అనకాపల్లి జిల్లా చోడవరం మండలం భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆధ్వర్యంలో చోడవరం తామర చెరువు వీధి, సంతకి వీధి శివారు ప్రాంతాల్లో పర్యటన భాగంగా అక్కడ ఉన్న మహిళలు మంచినీరు రాక సుమారుగా కిలోమీటర్ దూరం వెళ్లి మంచినీళ్లు తెచ్చుకొని దాహం తీర్చుకునే పరిస్థితి ఏర్పడుతుంది అధికారులు అసమర్థత వల్ల పర్యవేక్షణ లోపం వల్ల పైఎగువ ప్రాంతాల్లో ఉన్న నిర్వాసితులు నీరు వృధా చేయడం వల్ల లోతట్టు ప్రాంతం వైపు నీరు చేరే పరిస్థితి లేకుండా పోయింది అక్కడ ప్రజలు జీవన పరిస్థితి మంచినీరు లేక ఇబ్బంది పడతా ఉన్నారు గతంలో చాలా సందర్భాల్లో పంచాయతీ అధికారులు తెలియజేసిన పట్టించుకోలేదని అక్కడున్న నిర్వాసితులు వాపోతున్నారు అధికారులు చోడవరం మేజర్ పంచాయతీ లో ఉన్న ప్రజలకు మంచినీరు అందకపోవడం దుర్మార్గమని కేవలం అధికారులు వైఫల్యం వల్ల మాత్రమే ఏర్పడుతుందని గతంలో జరిగిన గ్రామసభలో కమ్యూనిస్టు పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు మంచినీరు సంబంధించి చోడవరం పంచాయతీలో లోపం ఉన్నదని అదే మాదిరిగా బురద నీళ్లు కలుషితమైన నీరు వస్తుందని దాని వలన చాలామంది ప్రజలు అనారోగ్యాన్ని బారినపడి టైఫాయిడ్ మలేరియా తో విష జ్వరాలతో ఇబ్బంది పడుతున్నారని. కావున ఈ సమస్య పరిష్కారం చేయాలని తెలియజేసిన నేటికి కూడా సమస్య పరిష్కారం చేయకుండా చేతులు దులుపుకునే పరిస్థితి ఏర్పడింది చోడవరం పంచాయతీలోవాటర్ ఫిట్టర్ లేకపోవడం దీనికి ప్రధానమైన కారణం అధికారులు వెంటనే సమస్య పరిష్కారం చేసి చందకు వీధి శివారులో ఉన్న ప్రజలకు నీరు అందే విధంగా చర్యలు చేపట్టాలని కమ్యూనిస్టు పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో పంచాయతీ కార్యాలయం వద్ద మహిళతో పెద్ద ఎత్తున ఆందోళన చేయవలసిన పరిస్థితి ఏర్పడతాదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఈ కార్యక్రమంలో గూనురు వరహాలమ్మ, చప్ప కుమారి శనివాడ సత్యవతి పోతల సంతోషి డోకల అమ్మాజీ ,పైడా నాగమణి, దేవి ,లక్ష్మి ,అప్పుల నరసమ్మ అరుణ, నారాయణమ్మ, మరియు స్థానికులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *