రెండో రోజు మహానాడు కార్యక్రమాలు ఘనంగా కొనసాగుతున్నాయి.

పయనించే సూర్యుడు మే 29 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమంలో భాగంగా, ఆదోని నియోజకవర్గంలో రెండో రోజు కార్యక్రమాలు ఉత్సాహభరితంగా కొనసాగాయి.ఈ సందర్భంగా ఆదోని నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ మీనాక్షి నాయుడు టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు ఆదోని అబ్జర్వర్ కేశవ రెడ్డి కలిసి ఆదోని పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో నిర్వహిస్తున్న 10 క్లస్టర్ల మహానాడు కార్యక్రమాలను ప్రత్యక్షంగా సందర్శించి పరిశీలించారుప్రతి క్లస్టర్‌లో నాయకులు, కార్యకర్తలు ఎంతో ఉత్సాహంతో పాల్గొంటూ పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు మరియు భవిష్యత్ కార్యాచరణపై చర్చలు నిర్వహించారు. నాయకులు కార్యకర్తలతో మాట్లాడి కార్యక్రమాల నిర్వహణ, హాజరు, ఏర్పాట్లపై వివరాలు తెలుసుకుని పలు సూచనలు చేశారు.టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు మాట్లాడుతూ, ఆదోని నియోజకవర్గంలో పార్టీ మరింత బలపడేందుకు క్లస్టర్ స్థాయిలో జరుగుతున్న ఈ మహానాడు కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు, క్లస్టర్ ఇంచార్జ్‌లు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *