పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం మే 29 పెనుగంచిప్రోలు, గ్రామంలోని ఈ రోజున మాజీ ముఖ్యమంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్)103 జయంతి సందర్భంగా పెనుగంచిప్రోలు లోని ఎన్ టీ ఆర్ విగ్రహానికి ఎం పి కేశినేని శివన్నాద్ స్థానిక నాయకులు, పార్టీ శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి అనంతరం తెలుగుదేశం పార్టీ ఆది నాయకత్వం పిలుపు మేరకు పెనుగంచిప్రోలు కంఠ మ నేని పంక్షన్ హాల్ లో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చింతల సీతారామయ్య ఆధ్వర్యంలో జరుగు తున్న శ్రీ శక్తి మహానాడు డిజిటల్ ఈ. కార్యక్రమమునకు ముఖ్య అధితి గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎం పి శివ నాద్ మాట్లాడుతూఎన్ టీ ఆర్ 103 వ జయంతి మనం మహానాడు లో జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానేత ఎన్టీఆర్ ని కొనియాడారు. రాజకీయాలలో ప్రజాసేవకు కొత్త నిర్వచనం ఇచ్చిన నాయకుడు ఎన్టీఆర్ గారేనని, పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఆయన పాలన సాగిందన్నారు. సినీ రంగంలో అపార ఖ్యాతి గడించినప్పటికీ ప్రజల పట్ల ఉన్న అపారమైన ప్రేమతో రాజకీయాల్లోకి వచ్చి తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు తెలుగుదేశం పార్టీని స్థాపించారని గుర్తు చేశారు.కేవలం తొమ్మిది నెలల వ్యవధిలోనే ప్రజల ఆశీస్సులతో అధికారంలోకి వచ్చి దేశ రాజకీయ చరిత్రలోనే అరుదైన ఘనత సాధించిన మహానేత ఎన్టీఆర్ ని పేర్కొన్నారు. రెండు రూపాయల కిలో బియ్యం పథకం, మహిళలకు ఆస్తి హక్కులు, పేదలకు గృహాల నిర్మాణం, రైతులకు ప్రోత్సాహక కార్యక్రమాలు, సామాన్య ప్రజలకు పరిపాలనను చేరువ చేసిన ఎన్నో సంస్కరణలు ఆయన దూరదృష్టికి నిదర్శనమని తెలిపారు.తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ఎన్టీఆర్ చేసిన సేవలు చిరస్మరణీయమని ఎం పి పేర్కొన్నారు. సినిమాల్లో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వంటి పౌరాణిక పాత్రల ద్వారా కోట్లాది మంది ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేశారని అన్నారు. రాజకీయాల్లోనూ అదే నిబద్ధత, నిజాయితీతో ప్రజల కోసం పనిచేసి నాయకత్వానికి కొత్త ప్రమాణాలు ఏర్పరచారని కొనియాడారు.ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం జరుగుతున్న కార్యక్రమాలన్నీ ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగానే కొనసాగుతున్నాయని తెలిపారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ ఎన్టీఆర్ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్టీఆర్ సేవలను స్మరించుకుంటూ నినాదాలు చేసి కేక్ కట్ చేశారు..అనంతరం ఎం పి శివ నాద్ కార్యకర్తలకు మజ్జిగ పంపిణీ చేశారు, ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీఅధ్యక్షులు చింతల సీతారామయ్య, మాజీ ఎంపిపి వేగినేటి గోపాల కృష్ణ మూర్తి, సోసైటీ అధ్యక్షులు కర్ల వెంకట నారాయణ,అనిగండ్ల పాడు సోసైటీ అధ్యక్షులు అత్తు లూరి అచ్చు త రావు, ముళ్ళపాడు సొసైటీ అధ్యక్షులు ఉమ్మినేని పుల్లారావు. పోలంపల్లి డ్యామ్ చైర్మన్ పొన్నం బాలాజీ విజయవాడ పార్లమెంట్ అధికార ప్రతినిధి నల్లమోలు శివ వర ప్రాసాద్,శ్రీ తిరుపతమ్మ ఆలయ మాజీ చేర్మెన్ నూతల పాటి చెన్న కేశవ రావు ఉత్సవ కమిటీ మాజీ. చైర్మన్ చుంచు రమేష్, మాజీ జెడ్ పి టీ సి లు కాకాని శ్రీను, మాజీ జెడ్పిటిసి సభ్యులు గజ్జి కృష్ణ మూర్తి, మాజీ జెడ్పిటిసి సభ్యులు గింజుపల్లి.శ్రీదేవి. తెలుగు యూవతనాయకులు. గింజుపల్లి. గోపి..లగడపాటి ప్రవీణ్,మాజీ సర్పంచ్ జిల్లేపల్లి సుదీర్ బాబు, తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షులు కొత్తపల్లి సతీష్ కుమార్,ఎం పిటిసి పొందూరి విజయలక్ష్మి మాజీ సోసైటీ అధ్యక్షులు పొందూరి శ్రీనివాసరావు తోట్టెం పూడి మురళీ దేవినేని చంద్రశేఖర్, మాదినేని వెంకట్రావు, శివా, నల్లపు నేని కొండ, మహమ్మద్ అజాద్,రాజు తెలుగు మహిళలు గింజుపల్లి అరుణ, సూర్య కుమారి,న ల్లపు నేని జ్యోతి మండలస మై ఖ్య అధ్యక్షురా లు. కర్ల కోటేశ్వరి,వివిధ హోదాలలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.