పయనించే సూర్యుడు జూన్ 14, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని : చింతకాని మండలం తిర్లాపురం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ మండల నాయకులు బండి రామారావు తండ్రి, దివంగత బండి వెంకటేశ్వర్లు దశదిన ఖర్మ కార్యక్రమం శనివారం గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన చింతకాని మీడియా సభ్యులు అంబటి శాంతయ్య,శెట్టి సురేష్ , గడ్డం విజయ్, వేర్పుల కోటేశ్వరరావు, సందీప్ రెడ్డి,తిర్లాపురం సర్పంచ్ చాపలమడుగు వీరబాబు తదితరులు బండి వెంకటేశ్వర్లు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి, బండి వెంకటేశ్వర్లు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. గ్రామ అభివృద్ధి, సామాజిక కార్యక్రమాల్లో ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ పలువురు నివాళులు అర్పించారు.