ఇల్లంతకుంట మార్కెట్ యార్డును సందర్శించిన ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ, రైతుల సమస్యలు తెలుసుకుని అధికారులకు కీలక ఆదేశాలు.

పయనించే సూర్యుడు న్యూస్ :మే /29:నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి :సాయిరెడ్డి బొల్లం :రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గంలోని ఇల్లంతకుంట మండలం లోని మార్కెట్ యార్డును మానకొండూర్ నియోజకవర్గ శాసనసభ్యులు & టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డా. కవ్వంపల్లి సత్యనారాయణ. సందర్శించి రైతులతో ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, సన్‌ఫ్లవర్ సాగు పురోగతి తదితర అంశాలపై రైతులతో చర్చించారు. యార్డుకు చేరుకున్న ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కి రైతులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం మార్కెట్ యార్డులో ధాన్యం నిల్వలు, తూకం ప్రక్రియ, కొనుగోలు కేంద్రాల నిర్వహణను ఆయన స్వయంగా పరిశీలించారు. రైతులతో కలిసి ధాన్యం సంచుల వద్దకు వెళ్లి నాణ్యత, కొనుగోలు విధానం గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా రైతులు ధాన్యం విక్రయ సమయంలో ఎదురవుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా కొనుగోలు ప్రక్రియలో జాప్యం, తూకం సమస్యలు, చెల్లింపుల ఆలస్యం వంటి అంశాలను వివరించారు. రైతుల బాధలను ఓపికగా విన్న ఎమ్మెల్యే వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రభుత్వం తరఫున కొనుగోళ్లు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. అలాగే సన్‌ఫ్లవర్ సాగు చేస్తున్న రైతులతో ప్రత్యేకంగా మాట్లాడిన ఎమ్మెల్యే వారి పంట పురోగతి, మార్కెట్ పరిస్థితులు, లాభనష్టాలపై వివరాలు రైతులు ఆర్థికంగా బలపడేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని ఆయన తెలిపారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ రైతులు పండించిన ప్రతి గింజకు గౌరవం దక్కేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రైతులు దేశానికి వెన్నెముక అని పేర్కొన్న ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి రైతు అభివృద్ధి అత్యంత ముఖ్యమని అన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర అందేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. రైతుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఐరెడ్డి చైతన్య మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ అయిలయ్య, ఉట్కూరి రమణ రెడ్డి, స్థానిక కాంగ్రెస్ నాయకులు, రైతు నాయకులు, మార్కెట్ యార్డు ప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *