బహుజన కుల వర్గ పోరాట నిర్మాత కామ్రేడ్ మారోజు వీరన్న 27వ వర్ధంతి సభ

పయనించే సూర్యుడు మే 29 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ. ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్టు పార్టీ(దళిత బహుజన శ్రామిక విముక్తి) వ్యవస్థాపక కార్యదర్శి మారోజు వీరన్న 27వ వర్ధంతి సందర్భంగా స్థానిక ఆదోని ఆర్ట్స్ కాలేజ్ ఆడిటోరియం నందు, బి డి ఎస్ ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ పగడాల రమేష్ అధ్యక్షతన ఏర్పాటుచేసిన సభకు ముఖ్య అతిథులుగా, ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కార్యదర్శి పగడాల కోదండ, ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు కొలిమి సుజ్ఞానమ్మ, ఆదోని జిల్లా సాధన జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు వైపి నాగరాజు, పాల్గొని వారు మాట్లాడుతూ ఈ దేశ శ్రామిక వర్గం పక్షాన సుదీర్ఘకాలంగా ఎందరో మహానుభావులు భూమికోసం భుక్తి కోసం ఈ దేశ విముక్తి కోసం చివరి శ్వాస వరకు పోరాడి అశువుల బాశారు అందులో కామ్రేడ్ మారోజు వీరన్న ఈ దేశంలో వర్గంతో పాటు కులం బలమైన పునాదులు కలిగి ఉందని మారోజు వీరన్న విశ్లేషించారు తాద అనుగుణంగా కులవర్గ పోరాటాలను రూపకల్పన చేశారు యితే ఇంతకాలం భౌతిక గత తర్కికాన్ని అవపాసన పట్టినట్టి కమ్యూనిస్టులు నామమాత్రంగా కుల వ్యవస్థ పట్ల కొనసాగుతున్నటువంటి మౌలిక ఆలోచన విధానాల పట్ల ఆయన సుదీర్ఘమైనటువంటి పరిశోధన చేసి ఈ దేశంలో ప్రజలకు శ్రమ ఫలితాలు దక్కాలంటే వర్గముతో పాటు కులం కూడా నిర్మూలన కావాలని ఆయన భావించారు తదనగుణంగా మహాత్మ పూలే అంబేద్కర్ ఆలోచన విధానంలో ప్రజలకు విముక్తి కావాలని ఆయన కులవర్గ పోరాటలు నిర్మించి కులాలకు హక్కుల పోరాటంతో పాటు రాజ్యాధికారం కోసం ఆయన వివిధ కుల సంఘాలకు ఆజ్యం పోశారు మా వాడలో మా రాజ్యం అంటూ సర్పంచులు గాను ఎమ్మెల్యేలు గాను ఎమ్మెల్సీలు గాను ఎంపీల గాను మా యొక్క జనాభా దామాషా ప్రకారం మాకు పదవులు కావాలంటూ నినాదించిన ఘనుడు మారోజు వీరన్న అలాగే మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు రాజ్యాంగంలో కల్పించిన ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు అయితే ఆ 33% రిజర్వేషన్ల విషయమై ఆయాకులలకు సంబంధించినటువంటి మహిళలకు అందులో భాగస్వామ్యం కల్పించాలని వారి యొక్క ప్రణాళికను రూపొందించుకున్నారు కామ్రేడ్ మారోజు వీరన్న కామ్రేడ్ వీరన్న ఆశయ సాధన కోసం నిరంతరం శ్రమంచి పనిచేసే ఆయన ఆకాంక్షను నెరవేరుస్తామని ప్రతిన బునారు, ఈ కార్యక్రమంలో ఆదోని జిల్లా సాధన జేఏసీ నాయకులు దాసరి గోవిందరాజులు, రచయిత కవి జేఏసీ నాయకులు నల్లారెడ్డి, ఆదోని జిల్లా సాధన జేఏసీ నాయకులు గుమ్మల బాలస్వామి, ఏ ఐ ఎఫ్ టి యు, నాయకులు గంగన్న, గంగపుత్ర సంఘం నాయకులు ప్రకాష్, కోళ్ల శీన, కిరణ్ కుమార్, దీపక్, విద్యార్థి నాయకులు పవన్, సాయి, లక్ష్యం రెడ్డి, వెంకటేష్, నాని, మరియు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *