సహకార సంఘాల జిల్లా ఉద్యో గుల యూనియన్ సమావేశం

పయ నించే సూర్యుడు మే 29 ముమ్మిడివరం ప్రతినిధి డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ ( సీఐటీయూ) జిల్లా కార్యవర్గ సమావేశం అద్యక్షుడు యర్రంశెట్టి రామచంద్రరావు అధ్యక్షతన అమలాపురం కే వి ఆర్ సొసైటీ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు తోట వెంకట్రామయ్య పాల్గొని ప్రసంగించారు. సంఘ ఉద్యోగుల కి గుదిబండ లా మారిన జి ఓ నెంబర్ 322 వెంటనే రద్దుచేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ నెల 12 వ తేదీ నుండి సహాయ నిరాకరణ కొనసాగించాలి అని తీర్మానించడం జరిగింది. అలాగే సంఘం యొక్క అదనపు షేరు ధనం సంఘాల అప్పుల ఖాతాకి జమచేయాలని డిమాండ్ చేయడం జరిగింది.2011 నుండి అప్కాబ్ వారినుండి వచ్చిన 6 శాతం డివిడెండ్ వెంటనే జమచేయవలెను, అలాగే నెగిటివ్ క్లెయిమ్ పేరుతో సంఘాలనుండి అనధికారకం గా వసూలు చేసిన వడ్డీ రాయితీ వెంటనే అప్పుల ఖాతాకి జమచేయాలని డిమాండ్ చేయడం జరిగింది. అలాగే సంఘము ద్వారా మంజూరు చేయుచున్న షేరు ధనం 5 శాతం మాత్రమే వసూలుచేయాలని కోరడం జరిగింది. వ్యవసాయ ఋణాలు పాత పద్ధతి ప్రకారం మంజూరు చేయాలని కోరుచున్నాము. ఈ కార్యక్రమం లో రాష్ట్ర కోశాధికారి పెంకే సత్యనారాయణ, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి లు కుంపట్ల అయ్యప్ప నాయుడు, మట్టపర్తి జయరాం, కోశాధికారి బొబ్బా సుబ్రహ్మణ్య చౌదరి, టి. సోమన్న బి. లీలకృష్ణ, బి. భాస్కరరావు, ఏ. సూరిబాబు, జి. సూర్యనారాయణ చౌదరి, పోలిశెట్టి ఈశ్వరుడు, పీ వెంకటేశ్వరరావు, జగతా ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *