గృహ నిర్మాణలకు ఆర్థిక సహాయంఅందించిన కందాల

పయనించే సూర్యుడు, మే 26: పైనంపల్లి గ్రామానికి చెందిన కుక్కల సుగుణ భర్త సంజీవరావు మరియు కుక్కల మీరమ్మ భర్త ఇశ్రాయేలు కుటుంబాలు గృహ నిర్మాణం కోసం ఆర్థిక సహాయం అందించాలని మాజీ శాసన సభ్యులు కందాళ ఉపేందర్ రెడ్డి ని ఆశ్రయించగా, వారి ఆర్థిక పరిస్థితిని గుర్తించి,వెంటనే స్పందించి సహాయం అందించాలని సూచించారు. వెంటనే , మాజీ పి ఏ సి ఎస్ చైర్మన్ పైనంపల్లి.డా.నాగుబండి శ్రీనివాసరావు స్పందించి, ఇరు కుటుంబాలకు చెరి 30 చొప్పున మొత్తం 60 సిమెంట్ బస్తాలను ఆర్థిక సహాయంగా అందజేశారు నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తూ, అవసర సమయంలో సహాయం అందించిన మాజీ శాసన సభ్యులు శ్రీ కందాళ ఉపేందర్ రెడ్డి , మండల అధ్యక్షులు వున్నo బ్రహ్మయ్య మరియు డా. నాగుబండి శ్రీనివాసరావు సేవాభావానికి బాధిత కుటుంబాలు మరియు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *