“భారతీయులందరూ సమానమే! భారతదేశం సురక్షితం కాదు అనే మాటను అస్సలు ఒప్పుకోలేం.

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మే 30 .05.2026 మదనపల్లి అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ 0 ప్రతినిధి జె. నాగరాజ// లౌకికవాదం గురించి మన దేశానికి ఎవరూ బుద్ధులు చెప్పక్కర్లేదు. మైనారిటీల సంక్షేమానికి, రక్షణకు భారతదేశమే అత్యుత్తమ దేశం. ​ఒకవేళ భారతీయ ముస్లింలను ఒక దేశంగా గుర్తిస్తే, అది ప్రపంచంలోనే 6వ అతిపెద్ద దేశం అవుతుంది. అంతటి జనాభా ఉన్న ముస్లింలైనా, కేవలం 53 వేల మంది ఉన్న పారశీకులైనా ఇక్కడ సమాన రక్షణతో బతుకుతున్నారు. సనాతన కాలం నుండి హిందూ సమాజం అన్ని మతాలను అక్కున చేర్చుకుంది. ​ఇక్కడ అన్ని మతాలు వర్ధిల్లాయి. అయితే, జనాభా శాతాన్ని గమనిస్తే.. భారతదేశంలో కేవలం హిందువులు, పారశీకుల జనాభా శాతం మాత్రమే తగ్గుతూ వచ్చింది.” పి అయూబ్ ఖాన్ రాష్ట్ర బీజేపీ మైనారిటీ మోర్చా నాయకులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *