‘పయనించే సూర్యుడు’ కథనానికి  దక్కినఫలితం_స్పందించిన ఆర్.ఎమ్.సి యాజమాన్యం

* రోడ్డు మరమ్మతులు పూర్తి,సుగమమైన రహదారి * 6 వార్డు మెంబర్ నరిగె శ్రీనివాసులు, కారోబార్ పాశం నర్సింలు పర్యవేక్షణలో పనులు పూర్తి * సమస్య ఏదైనా నిలదీస్తే పరిష్కారం దక్కాల్సిందే_ సర్పంచ్ కిష్టారం గాయత్రి మల్లేష్ గౌడ్, ఉప సర్పంచ్ పాలెం ప్రవీణ్ గౌడ్ * ఆర్.ఎమ్.సి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపిన రాయపల్లి గ్రామస్తులు, యువకులు

పయనించే సూర్యుడు మే 30 మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ నరిగె కళాశేఖర్: జాతీయ రహదారి 44 ముదిరెడ్డిపల్లి నుండి రాయపల్లి గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై ఆర్.ఎమ్.సి లారీల వల్ల ఏర్పడిన గుంతలు, కంకర సమస్యకు పరిష్కారం లభించింది. ఈ రోడ్డు దెబ్బతినడం వల్ల వాహనదారులు పడుతున్న ఇబ్బందులపై ‘పయనించే సూర్యుడు’ ఇటీవల వరుస కథనాలను ప్రచురించింది. దీనిపై స్పందించిన స్థానిక ఆర్.ఎమ్.సి యాజమాన్యం, నేడు రోడ్డుకు మరమ్మతులు చేపట్టింది.ఈ సందర్భంగా రాయపల్లి సర్పంచ్ కిష్టారం గాయత్రి మల్లేష్ గౌడ్, ఉప సర్పంచ్ పాలెం ప్రవీణ్ గౌడ్ ,6 వ వార్డు మెంబర్ నరిగె శ్రీనివాసులు, కారోబార్ పాశం నర్సింలు స్పందిస్తూ గత కొద్ది రోజులుగా భారీ వాహనాల రాకపోకల వల్ల రోడ్డు పూర్తిగా దెబ్బతిని, కంకర తేలి ప్రమాదకరంగా మారింది. దీనివల్ల ద్విచక్ర వాహనదారులు, బాటసారులు నిత్యం జారిపడి గాయాలపాలవుతున్నారు. దీనిపై గ్రామస్థులు, వాహనదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఉన్న క్రమంలో పయనించే సూర్యుడు పత్రికలో వచ్చిన వార్తలకు స్పందించిన ఆర్.ఎమ్.సి నిర్వాహకులు, నేడు రోడ్డుపై ఏర్పడిన గుంతలను పూడ్చి కంకరను  తొలగించి, మరమ్మతులు చేపట్టడంతో. రోడ్డు సుగమం అయ్యింది.దీనితో వాహనదారులు  ,బాటసారులు , హర్షం వ్యక్తం చేస్తున్నారని , భవిష్యత్తులో కూడా ఇదే విధంగా బాధ్యతాయుతంగా వ్యవహరించి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, నిబంధనలను పాటించాలని యాజమాన్యాన్ని కోరుతూ ఆర్.ఎమ్.సి నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. సమస్య ఏదైనా నిలదీస్తే పరిష్కారం దక్కాల్సిందేనని అన్నారు. ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చిన పయనించే సూర్యుడు పత్రిక విలేకరి నరిగె కళాశేఖర్ కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రాయపల్లి 6 వార్డు సభ్యులు నరిగె శ్రీనివాసులు, కారోబార్ పాశం నర్సింలు, పాలెం భాస్కర్ గౌడ్ , నరిగె రామచంద్రయ్య, ఉసిళ్ళ బాలకృష్ణ, నరిగె కళాశేఖర్, పాలెం పర్వతాలు గౌడ్ తో పాటు ఆర్.ఎమ్.సి యాజమాన్యం సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *