అంబేద్కర్ నగర్ వైసిపి నాయకుడు గోల్డ్ రమేష్ బిజెపి పార్టీలో చేరిక

పయనించే సూర్యుడు మే 30 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ. స్థానిక జేబీ గార్డెన్ నందు జరిగిన బిజెపి జిల్లా స్థాయి సమావేశం నందు ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి వాల్మీకి గ సమక్షంలో బిజెపి తీర్థం పుచ్చుకున్న వైసీపీ నాయకుడు గోల్డ్ రమేష్ ఈ సందర్భంగా గోల్డ్ రమేష్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా వైసీపీ పార్టీలో ఎట్టి చాకిరీ చేసినా కూడా కనీసం మర్యాద కూడా పెట్టలేదని నా వార్డు అభివృద్ధి కొరకు డాక్టర్ పార్థసారథి వాల్మీకి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈరోజు అంబేద్కర్ నగర్ కాలనీ నుండి దాదాపు 300 వరకు కుటుంబాలతో పాటు వైసిపి నుండి బిజెపిలో చేరానని తెలపడం జరిగింది.బిజెపి పార్టీలో చేరిన వారిలో గోల్డ్ రమేష్ తో పాటు బొబ్బిలి వీరేష్ మరియు తదితరులు చేరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *