40 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానానికి ఘనంగా వీడ్కోలు _  మహబూబ్ నగర్ ఆర్టీసీ డిపోలో వంగ శ్రీనివాస్ గౌడ్ పదవీ విరమణ వేడుక

* వృత్తిలో బాధ్యత.. కళలో అంకితభావం_ మహబూబ్ నగర్ జిల్లా జానపద కళాకారుల సంఘం అధ్యక్షుడు టంకర శ్రీనివాస్ * ఇకపై మరింత ఉత్సాహంతో జానపద కళా రంగాన్ని ముందుకు తీసుకెళ్లాలి _ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కళాకారులు * పెద్ద ఎత్తున పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారులు, సహోద్యోగులు, అభిమానులు

పయనించే సూర్యుడు మే 31 మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ నరిగె కళాశేఖర్: తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా సేవలందిస్తున్న వంగ శ్రీనివాస్ గౌడ్ ఆర్టీసీ కండక్టర్‌గా 40 సంవత్సరాల సుదీర్ఘమైన, నిర్విరామ సేవలను పూర్తి చేసుకుని నేడు పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ బస్ డిపోలో ఆయనను ఘనంగా సత్కరిస్తూ వీడ్కోలు సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహబూబ్ నగర్ జిల్లాతో పాటు, రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి జానపద కళాకారులు, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కళా రంగంలోనే కాకుండా, ఆర్టీసీ ఉద్యోగిగా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించిన శ్రీనివాస్ గౌడ్ కు సహచర కళాకారులు, తోటి ఉద్యోగులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా  కళాకారులు మాట్లాడుతూ, “కళాకారుల పక్షపాతిగా, సంఘం అధ్యక్షులుగా శ్రీనివాస్ గౌడ్ చేస్తున్న కృషి అభినందనీయం. 40 ఏళ్ల పాటు ఆర్టీసీలో నిబద్ధతతో పనిచేసి, పదవీ విరమణ పొందిన ఆయన, ఇకపై మరింత ఉత్సాహంతో జానపద కళా రంగాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జిల్లా జానపద కళాకారులు, ఆర్టీసీ డిపో మేనేజర్ , ఆర్టీసీ సిబ్బంది, ఆర్టీసీ మిత్ర బృందం , వివిధ జిల్లాల కళా ప్రతినిధులు , అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *