కేశవపట్నం హైస్కూల్లో టిఫిన్ బైఠక్

పయనించే సూర్యుడు జూన్ 13 శంకరపట్నం మండలం రిపోర్టర్ పెద్ది గట్టయ్య :ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 12 సంవత్సరాల సుపరిపాలన పూర్తయిన సందర్భంగా కేంద్ర మంత్రివర్యులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ పిలుపు మేరకు “మనబడి – మన బాధ్యత” కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని కేశవపట్నం హైస్కూల్ గ్రౌండ్ లో బిజెపి మండల అధ్యక్షుడు ఎనుగుల అనిల్ ఆధ్వర్యంలో. “టిఫిన్ బైఠక్” కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అథిదిగా రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దండు కొమురయ్య హాజరై ప్రసంగించారు. ప్రభుత్వ పాఠశాల లో బలోపేతానికి పాఠశాలలో పచ్చదన పరిశుభ్రతను పెంపొందించుటకు ఈనెల 14 నుండి స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వంకాయ గూడెం గ్రామ సర్పంచ్ ఎన్నెం మల్లేష్ బిజెపి సీనియర్ నాయకులు దొంగల రాములు దాసరపు నరేందర్, నిమ్మశెట్టి సంపత్, రాసమల్ల శ్రీనివాస్, వడ్లకొండ రాజేంద్రప్రసాద్, బిజిలి సారయ్య, మెడిశెట్టి రాజేష్, నర్సయ్య, అరవింద్, శ్రీకాంత్, కుమార్, నరసింహస్వామి, సంతోష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *