సూరంపల్లి గ్రామ అభివృద్ధికి హామీ ఇచ్చిన ఎంపి రఘునందన్ రావు

" మర్యాదపూర్వకంగా కలిసిన గ్రామ సర్పంచ్ స్వప్న స్వామి ఉప సర్పంచ్ తాటి సాయి "

పయనించే సూర్యుడు మే 21 రాజేష్ దౌల్తాబాద్) మాధవనేని రఘునందన్ రావు ను మర్యాదపూర్వకంగా కలిసి గ్రామ అభివృద్ధి సమస్యలను వినిపించిన స్వప్న స్వామి మరియు తాటి సాయి నేతృత్వంలోని పాలకవర్గం సూరంపల్లి గ్రామ అభివృద్ధికి ఎంపీ రఘునందన్ రావు హామీ సిసి రోడ్లు, మురికి కాలువలు, కరెంటు స్తంభాల ఏర్పాటుకు సహకారం అందిస్తామని స్పష్టం దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామ అభివృద్ధి పనులపై గ్రామ పాలకవర్గం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో గ్రామ సర్పంచ్ స్వప్న స్వామి మరియు ఉప సర్పంచ్ తాటి సాయి ఆధ్వర్యంలో మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావును ఈరోజు మర్యాదపూర్వకంగా కలిసి గ్రామంలోని పలు కీలక సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. గ్రామంలో అత్యవసరంగా చేపట్టాల్సిన సిసి రోడ్లు, మురికి కాలువల నిర్మాణం, కరెంటు స్తంభాల ఏర్పాటు తదితర అభివృద్ధి పనులకు సహకరించాలని ఎంపీ గారిని కోరారు. గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి, త్వరితగతిన నిధులు మంజూరు చేసి పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు సానుకూలంగా స్పందిస్తూ, సూరంపల్లి గ్రామ అభివృద్ధికి తన వంతు పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. గ్రామ ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో ఎలాంటి లోటు ఉండకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు బండి శ్రీలత, బొల్లం రాజేష్, కడారి పోచయ్య, కె. మల్లేష్, బీజేపీ గ్రామ అధ్యక్షుడు తైల కుమార్, మండల సీనియర్ నాయకులు మాదాడి భూపతిరెడ్డి, ముత్యాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గ్రామాభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులు, పాలకవర్గం సమన్వయంతో ముందుకు సాగడం అభినందనీయమని గ్రామ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *