​మండుటెండల్లో కూలీలకు ఊరట

* పాత రెడ్డిగూడెంలో మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ ​* ఆరోగ్యంపై జాగ్రత్తలు వహించాలి : ఉప సర్పంచ్ ఉమ్మల దుర్గారెడ్డి, కమిటీ అధ్యక్షులు చిప్పల కొమ్మిరెడ్డి

పయనించే సూర్యుడు న్యూస్ మే 31 అశ్వారావుపేట మండల రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ​అశ్వారావుపేట మండలంలో తీవ్రమైన వేసవి ఎండలను సైతం లెక్కచేయకుండా బతుకుదెరువు కోసం కష్టపడుతున్న గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు అశ్వరావుపేట మండలం పాత రెడ్డిగూడెం గ్రామపంచాయతీ పాలకవర్గం అండగా నిలిచింది. శనివారం మండల పరిధిలోని పాత రెడ్డిగూడెం గ్రామపంచాయతీ పరిధిలో గల బండారు గుంపు విలేజ్ వద్ద ఉపాధి హామీ పనులు చేసుకుంటున్న కూలీల వద్దకు ఉప సర్పంచ్ ఉమ్మల దుర్గారెడ్డి, గ్రామపంచాయతీ కమిటీ అధ్యక్షులు చిప్పల కొమ్మి రెడ్డి స్వయంగా వెళ్లారు. మండుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని కూలీల దాహార్తిని తీర్చడానికి వారికి ఉచితంగా మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ​ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన గ్రామపంచాయతీ కమిటీ అధ్యక్షులు చిప్పల కొమ్మి రెడ్డి, ఉప సర్పంచ్ ఉమ్మల దుర్గారెడ్డి మాట్లాడుతూ వేసవి కాలంలో ఉపాధి కూలీలు తమ ఆరోగ్యం పట్ల అత్యంత జాగ్రత్తలు వహించాలని సూచించారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున తగినన్ని నీళ్లు తాగుతూ, సురక్షితంగా ఉండాలన్నారు. సమయపాలన పాటిస్తూ, ఎండ ముదరక ముందే పనులను సజావుగా పూర్తి చేసుకోవాలని వారు కూలీలకు దిశానిర్దేశం చేశారు. మండుటెండల్లో తమను పరామర్శించి మజ్జిగ ప్యాకెట్లు అందించడంపై కూలీలు హర్షం వ్యక్తం చేస్తూ, పంచాయతీ కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. ​ఈ సేవా కార్యక్రమంలో వార్డు సభ్యులు చిప్పల సూర్యకాంతం, నారం నాగేశ్వరరావు, పంచాయతీ సిబ్బంది మడివి వెంకటేష్, ఉమ్మల నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే కూలీల మేటు చిప్పల యశోద, ఉమ్మల పొట్టెమ్మ, చిప్పల వెంకన్న బాబు, బైట్ గోపాలరావు, ఆదిలక్ష్మి, కూరం వాణి, నారం ప్రసాద్‌తో పాటు పెద్ద సంఖ్యలో ఉపాధి హామీ కూలీలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *