ఓసి-1లో ఘనంగా మంత్రి శ్రీధర్ బాబు పుట్టినరోజు వేడుకలు

* కేంద్ర కార్యదర్శి గడ్డం తిరుపతి యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహణ

పయనించే సూర్యుడు న్యూస్: పెద్దపల్లి, సెంటినరీ కాలనీ-31 తెలంగాణ ఐటి, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్, పరిశ్రమలు, వాణిజ్యం & శాసన వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు 57వ జన్మదిన వేడుకలను సింగరేణి ఆర్జి-3, ఓసి-1 ఆపరేషన్ సైట్ ఆఫీస్ వద్ద కార్మికుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఐఎన్టీయూసీ కేంద్ర కార్యదర్శి గడ్డం తిరుపతి యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు తెలంగాణలో బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం చేస్తున్న అమూల్యమైన, అవిశ్రాంత కృషిని కొనియాడారు. బలమైన తెలంగాణను నిర్మించడంలో ఆయనకు మంచి ఆరోగ్యం, ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు కలగాలని, ఇంకా ఎన్నో సంవత్సరాలు ప్రజా సేవలో ఉండాలని మనసారా కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.సింగరేణి ఉద్యోగుల సంక్షేమం కోసం సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ, నిరంతరం అందుబాటులో ఉండటమే కాకుండా, ఆర్జి-3 ఏరియాలో ఐఎన్టీయూసి గెలుపు కోసం మంత్రి చేసిన కృషిని ఎప్పటికీ మరవలేమని గుర్తు చేశారు.కార్యక్రమం ముగింపులో హాజరైన ఉద్యోగులందరికీ క్యాంటీన్‌లో టీ, టిఫిన్ ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ ఏరియా కోశాధికారి కొలిపాక సారయ్య, నాయకులు ఎం. ప్రభాకర్ రెడ్డి, కొండల్ రెడ్డి, ఎం. నరేష్ కుమార్, జంజర్ల తిరుపతి, కొట్టే రాంచందర్ రావు, రాజన్న, వినయ్, తిరుమలేష్, కృష్ణమూర్తి, రాజా రామ్, చిట్టబోయిన శ్రీనివాస్, దిలీప్, సాంబయ్య, మల్లేష్ యాదవ్, తన్నీరు శ్రీనివాస్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *