ముమ్మిడివరం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కైలాస రథం ప్రారంభించిన ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు .

పయనించే సూర్యుడు న్యూస్ 31 ( ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) ముమ్మిడివరం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సుమారు రూ.9 లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన “కైలాస రథం”ను ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ, సమాజ సేవా కార్యక్రమాలలో ఎల్లప్పుడూ ముందుండే రోటరీ క్లబ్ సభ్యులు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కైలాస రథాన్ని అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. అంత్యక్రియల సమయంలో ప్రజలకు ఆర్థిక భారం తగ్గించే విధంగా నామమాత్రపు రుసుముతో ఈ సేవలను అందించేందుకు రోటరీ క్లబ్ ముందుకు రావడం గొప్ప సేవా కార్యక్రమమని కొనియాడారు. ముమ్మిడివరం నియోజకవర్గ ప్రజలు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అవసరమైన సమయంలో ఈ సేవలను వినియోగించుకోవాలని ఆయన సూచించారు.

కైలాస రథం సేవల కోసం సంప్రదించవలసిన నంబర్లు:.

.
99897 32823, 88979 91844, 99634 83888

ఐ. పోలవరం మండలం మురమళ్ల లో జరిగిన ఈ కార్యక్రమం లో ఎస్సి కార్పోరెషన్ డైరెక్టర్ చెల్లి అశోక్, రొటరేయిన్ డా. శివ కుమార్ కే సోమరాజు, కే సురేష్, చిన్నారావు, డి విజయ్ ,ఎన్ కిరణ్ , జేజి బాబు, జి పెద్ద, టి నాగరాజారావు, ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు ,పలువురు టిడిపి నాయకులు, రోటరీ క్లబ్ సభ్యులు స్థానిక ప్రముఖులు నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *