బీసీ జాగృతి సేన మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడిగా జెనిగల శేఖర్ యాదవ్ నియామకం

* రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య సమక్షంలో బాధ్యతల స్వీకరణ * బీసీల హక్కుల సాధనే లక్ష్యం_జెనిగల శేఖర్ యాదవ్

పయనించే సూర్యుడు జూన్ 02, మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ నరిగె కళాశేఖర్: మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం ఈద్గాన్ పల్లి గ్రామానికి చెందిన జెనిగల శేఖర్ యాదవ్‌ను బీసీ జాగృతి సేన మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ మేరకు రాజ్యసభ సభ్యులు, బీసీ దళపతి ఆర్. కృష్ణయ్య, బీసీ జాగృతి సేన రాష్ట్ర అధ్యక్షులు బూర్గుపల్లి కృష్ణ యాదవ్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేసి బాధ్యతలను అప్పగించారు. ఈ సందర్భంగా శేఖర్ యాదవ్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్యకు , రాష్ట్ర అధ్యక్షులు బూర్గుపల్లి కృష్ణ యాదవ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గ్రామ మండల కమిటీలను పటిష్టం చేస్తామని , గ్రామంలో బీసీ చైతన్య సదస్సులు నిర్వహించి, బీసీల హక్కుల కోసం పోరాడుతామని తెలిపారు. ముఖ్యంగా చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్లు సాధించడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ జాగృతి సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేష్ యాదవ్, జడ్చర్ల మండల అధ్యక్షులు గొడుగు నర్సిములు, గంగపుత్ర వీరేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *