కీమ్యాతాండా కేతరబండలో ఉచిత మెగా వైద్య శిబిరంప్రతి నెల గ్రామంలోనే పెన్షన్ పంపిణీ

కార్యక్రమంలోసర్పంచ్ రామచందర్ నాయక్ వివేక్ హాస్పిటల్ సిబ్బంది

పయనించే సూర్యుడు మే 23 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ నాగర్‌కర్నూల్ జిల్లా కిమ్యాతాండ గ్రామపంచాయతీ పరిధిలోని కేతరబండలో నాగర్‌కర్నూల్ వివేక్ హాస్పిటల్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ముఖ్యంగా షుగర్, బీపీ వ్యాధిగ్రస్తుల కోసం ఏర్పాటు చేసిన ఈ హెల్త్ క్యాంప్‌ను గ్రామ సర్పంచ్ రామచందర్ నాయక్ ప్రారంభించారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై వైద్య పరీక్షలు చేయించుకోవడంతో శిబిరం విజయవంతమైంది. ఈ సందర్భంగా సర్పంచ్ రామచందర్ నాయక్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఇకపై ప్రతి నెల వృద్ధాప్య, వికలాంగ మరియు ఇతర పెన్షన్‌లను గ్రామంలోనే పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఈ నెల నుంచే గ్రామంలోనే పెన్షన్ పంపిణీ ప్రారంభమైనట్లు వెల్లడించారు. “ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతున్నాం. ప్రజల ఆరోగ్యం, సంక్షేమమే మా మొదటి ప్రాధాన్యత” అని సర్పంచ్ రామచందర్ నాయక్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివేక్ హాస్పిటల్ వైద్య అధికారులు, సిబ్బంది, గ్రామ ప్రముఖులు, యువకులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *