నిలిచిన నీరు తొలకరి చిరుజల్లుకి

పయనించే సూర్యుడు న్యూస్ మెట్ పల్లి జూన్ 14 పట్టణంలోని దుబ్బవాడలో మార్కెట్ రోడ్డు కు వెళ్లే రహదారిలో నిన్న కురిసిన మొదటి తొలకరి చిరుజల్లుకి ప్రధాన కూడలిలో నీరు నిలిచింది. ఈ కూడలి మార్కెట్ కి వెళ్లడానికి ప్రధాన రహదారి కావడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్న చిరుజల్లు కే ఈ విధంగా కనిపించడం మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా కనిపిస్తుంది. రహదారికి మరమ్మత్తులు చేసి నీరు నిలవకుండా చేయాలని వార్డు ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *