సోషల్ సర్వీస్ .. మా విధానం

•మాజీ ఎమ్మెల్యే హన్మంత రావు

పయనించే సూర్యుడు జూన్. 14. పాపన్నపేట మండల రిపోర్టర్ దుర్గాప్రసాద్ మైనంపల్లి సోషల్ సర్వీస్ ద్వారా పేద ప్రజలకు విస్తృతంగా సేవా చేస్తున్నట్లు మెదక్ మాజీ ఎమ్మెల్యే,కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హన్మంతరావు వివరించారు. గ్రామాల్లో నీటి సమస్యల పరిష్కారానికి వేలాది బోర్లు వేసినట్లు ఆయన గుర్తు చేశారు. ప్రజా సేవా మా విధానమన్నారు. శనివారం మండలం లోని ఎల్లాపూర్,కుర్తివాడ పలు గ్రామాల్లో బోర్లకు మోటర్లు సామాగ్రి అందజేసి ఆయన ప్రారంభించారు. అధికారులతో సమావేశమై అభివృద్ధి పనులను వేగవంతం చేస్తానని నాయకులతో అన్నారు. విస్తృతంగా గ్రామాల్లో పర్యటించారు. హస్తం శ్రేణులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంజనేయులు గౌడ్,ఉపాధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి,మండలాధ్యక్షుడు నరేందర్ గౌడ్,కిసాన్ సెల్ నాయకులు ప్రభాకర్ రెడ్డి, జిల్లా సర్పంచుల ఫోరమ్ ఉపాధ్యక్షుడు శ్రీధర్,మండలాధ్యక్షుడు నీరుడి వెంకటేశం,జిల్లా అధికార ప్రతినిధి శ్రీకాంత్ అప్ప, సర్పంచులు..పుట్టిశేఖర్,అంజయ్య,విజయ దుర్గా నాని,నాయకులు గోవింద్ నాయక్, కిష్టయ్య,గౌస్, ఖలీమ్,దోసనిసంగమేశ్వర్,అనుదీప్,చోటు,వినేష్ గౌడ్,కుమ్మరి శంకరయ్య,ఏసు,భరత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *