పయనించే సూర్యుడు జూన్ 2 బద్వేల్ నియోజకవర్గ రిపోర్టర్ ఓ జయ ప్రసాద్ పోరుమామిళ్ల మండలం సచివాలయం 2 పరిధిలోని రైతు శిక్షణ కేంద్రం నందు సోమవారం ప్రకృతి వ్యవసాయ సిబ్బంది డివిజన్ స్థాయి సమావేశం జరిగినది ఈ సమావేశంలో పోరుమామిళ్ల డివిజన్ ప్రకృతి వ్యవసాయ ఇన్చార్జి ఎన్ఎఫ్ఏ నరసింహారెడ్డి హాజరై వారు మాట్లాడుతూ పకృతి వ్యవసాయ యాక్టివిటీస్ మీద డివిజన్ పరిధిలోని కలసపాడు కాశి నాయన పోరుమామిళ్ల భీమటం బి కోడూరు అన్ని మండలాల క్యాడర్స్ అందరూ సమన్వయంతో కలిసి ఎలినినో ప్రభావాన్ని అధిగమించే విధంగా రైతులను పకృతి వ్యవసాయం చేయుటకు వారికి తగిన సూచనలు సలహాలు ఇచ్చి వారు రసాయన పురుగు మందులు వాడకం తగ్గించి పకృతి వ్యవసాయం చేసే విధంగా రైతులు కృషి చేయాలన్నారు అలాగే రేపటినుండి స్టేట్ ఈవిసి జిల్లా డిపిఎం ఆదేశాల ప్రకారం పీఎండీఎస్ వారోత్సవాలను ప్రతి గ్రామంలో రైతులతో రోజుకి ఐదు నుండి పది ఎకరాల లో విత్తనాలను ఫిల్ట్రాజేషన్ చేసి భూముల్లో చల్లుకునే విధంగా కృషి చేయాలని అదేవిధంగా ఇన్పుట్ ప్రిపరేషన్ ఘనజీవామృతం ద్రవ జీవామృతం కూడా రైతులు స్వయంగా తయారు చేసుకునే విధంగా నేర్పించాలని వర్షాధార పంటలు నీటి వసతి ద్వారా పంటలను ఎలా వేసుకోవాలనే విధానంపై వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంటి లు డి ఎం ఎం టి లు యూనిట్ ఇన్చార్జిలు ఐ సి ఆర్ పి లు మెండర్స్ ఫార్మర్ సైంటిస్టులు పాల్గొన్నారు