ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల్లో పాల్గొన్న సర్పంచ్ విజయ దీప్లా

అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు అందేలా కృషి చేస్తాం

పయనించే సూర్యుడు జూన్ 2 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ వసూరాం తాండ గ్రామ పంచాయతీ పరిధిలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో సర్పంచ్ విజయ, ఉపసర్పంచ్ హనిమి దేవా, సింగిల్ విండో డైరెక్టర్ దీప్ల నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ విజయ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదల సొంతింటి కలను నెరవేరుస్తోందన్నారు. ఈ పథకాన్ని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ కూచకుళ్ల రాజేష్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు. మిగిలిన ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేసి, రెండో విడతలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందేలా కృషి చేస్తామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *