నూతన ఏఎల్‌వో కి భవన నిర్మాణ కార్మిక సంఘం ఘన సన్మానం

పయనించే సూర్యుడు న్యూస్: ప్రతినిధి,జూన్ 13: భవన నిర్మాణ రంగ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బాన్సువాడ సహాయ కార్మిక అధికారి కార్యాలయంలో నూతనంగా ఇన్‌చార్జిగా బాధ్యతలు స్వీకరించిన కామారెడ్డి సహాయ కార్మిక అధికారి (ఏఎల్‌వో), బాన్సువాడ ఇన్‌చార్జి రాజు ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా భవన నిర్మాణ రంగ కార్మికులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు, కష్టసుఖాలను సంఘం నాయకులు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని, వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని హామీ ఇచ్చారు.అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో అమలవుతున్న విధానాలను బాన్సువాడ అసిస్టెంట్ లేబర్ కార్యాలయంలో కూడా అమలు చేయాలని సంఘం నాయకులు కోరారు. ముఖ్యంగా నకిలీ లేబర్ కార్డుల జారీని అరికట్టడంతో పాటు, కార్మికులను మోసం చేస్తున్న మధ్యవర్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.దీనిపై స్పందించిన అధికారి నకిలీ లేబర్ కార్డులు జారీ కాకుండా సాధ్యమైనంత వరకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం కామారెడ్డి జిల్లా ఇన్‌చార్జి వ్యవస్థాపక అధ్యక్షులు మర్లు సాయిబాబు, మండల కార్మిక నాయకులు ఓలెపు ప్రతాప్, దావూద్ తదితరులు పాల్గొన్నారు. కార్మికుల హక్కుల పరిరక్షణ, సంక్షేమ పథకాల సమర్థ అమలు కోసం సంఘం నిరంతరం కృషి చేస్తుందని నాయకులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *