సాలూరలో ఇందిరమ్మ గృహప్రవేశాలు.

పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 2 సాలూర : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా సోమవారం సాలూర మండలంలో నిర్మించిన ఇందిరమ్మ గృహప్రవేశాలకు తహసిల్దార్ ఎంఏ.నవాజ్,గ్రామ సర్పంచ్ సోక్కం లావణ్య రవి గృహప్రవేశాలకు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఇందిరమ్మ గృహాలు పూర్తిచేసుకుని గృహప్రవేశాలు చేసిన లబ్ధిదారులకు అధికారులు, ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు. పూర్తికాని ఇండ్లను లబ్ధిదారులు త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేసుకొని గృహప్రవేశాలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సాలూర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ అల్లె జనార్ధన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇల్తెపు శంకర్, నాగరాజు, నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *