మెరుగైన వైద్య సేవలే లక్ష్యం:- ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి

ఆదోనిలో ఘనంగా ఆశా వర్కర్ల డే- ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే పార్థసారధి.

పయనించే సూర్యుడు జూన్ 3 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ. ఆదోని:ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో వైద్య శాఖ అధికారులు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు అందరూ సమన్వయంతో ముందంజలో ఉండాలని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి పిలుపునిచ్చారు. మంగళవారం ఆశా వర్కర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానికంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో ప్రజల ఆరోగ్య సంరక్షణలో ఆశా వర్కర్లు మరియు ఏఎన్ఎంల పాత్ర అత్యంత కీలకమని కొనియాడారు. ప్రభుత్వ ఆసుపత్రులలో అందుతున్న సేవలను, సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయాలని సూచించారు. వైద్య సేవల్లో ఏ చిన్న సమస్య ఉన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని, వాటిని పరిష్కరించడానికి తమవంతు పూర్తి సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు.కార్యక్రమం లో డి ఎం హెచ్ ఓ కామేశ్వర ప్రసాద్,డిప్యూటీ డి ఎం హెచ్ ఓ సత్యవతి,మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్ఎంలు,ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *