పయనించేసూర్యుడు మే 20 ఆదోనిడివిజన్ ఇంచార్జి గుమ్మల బాలస్వామి శంకుస్థాపనలకే పరిమితమై, మరమ్మతులకు నోచుకోక, మధ్యలోనే నిలిచిపోయిన ఆదోని ప్రాంత సాగునీటి ప్రాజెక్టుల సాధన కోసం ఆదోని జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. ప్రాంతీయ వెనుకబాటుతనానికి అద్దం పడుతున్న పలు ప్రాజెక్టులను సందర్శించిన అనంతరం జేఏసీ నాయకులు ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆదోని జిల్లా సాధన జేఏసీ నాయకులు మాట్లాడుతూ, పాలకుల నిర్లక్ష్యం వల్ల ఆదోని ప్రాంతంలోని కీలకమైన ప్రాజెక్టులు దశాబ్దాలుగా మూలనపడ్డాయని మండిపడ్డారు. ముఖ్యంగా నగర్ డోన ప్రాజెక్ట్, వేదవతి ప్రాజెక్ట్, కోవెల తోట ఎత్తిపోతల ప్రాజెక్టులు శంకుస్థాపనలకే పరిమితమై అడుగు ముందుకు పడలేదు మేలుగనూరు వరద కాల్వ, రాజోలి బండ ఆర్ డి ఎస్ కుడి కాల్వ, గుండ్రేవుల, పులికనుమ, గురు రాఘవేంద్ర ఎత్తిపోతల ప్రాజెక్ట్, పందికోన ప్రాజెక్టులు నిర్మాణ పనులు మధ్యలోనే నిలిచిపోయి, సరైన మరమ్మతులు లేక పాలకుల ఉదాసీనతకు సాక్ష్యాలుగా నిలిచాయని ధ్వజమెత్తారు ఆదోని ప్రాంత రైతాంగాన్ని, ప్రజలను దశాబ్దాలుగా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాడుకున్నారే తప్ప, ఇక్కడి ప్రాజెక్టులను పూర్తి చేయాలనే సంకల్పం ఏ ప్రభుత్వానికీ లేదు. ఈ సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారం ఒక్కటే ఆదోని ప్రత్యేక జిల్లా ఏర్పాటు కావడం జేఏసీ నాయకులు ఆదోనిని ప్రత్యేక జిల్లాగా ప్రకటిస్తేనే పరిపాలనా వికేంద్రీకరణ జరిగి, ఈ ప్రాంత సాగు తాగునీటి ప్రాజెక్టులకు నిధులు మంజూరవుతాయని, అప్పుడే ఈ సమస్యలన్నీ. పరిష్కారమవుతాయని వారు స్పష్టం చేశారు. ఆదోని జిల్లా సాధనతో పాటు, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి కోసం రాబోయే రోజుల్లో పోరాటాన్ని ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు క్షేత్రస్థాయి పరిశీలన మరియు నిరసన కార్యక్రమంలో జేఏసీ నాయకులు పగడాల కోదండ, వై.పి. నాగరాజు, ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి బండారి హనుమంతు, ఎంఐఎం నాయకులు జునైద్, స్త్రీ విముక్తి నాయకురాలు సుజ్ఞానమ్మ, బీఎస్పీ జిల్లా నాయకులు రామలింగయ్య, గోవిందరాజులు, బి డి ఎస్ ఎఫ్ నాయకులు పగడాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.