అమరుల త్యాగాలే,తెలంగాణ రాష్ట్ర నిర్మాణానికి పునాదులు

మార్కెట్ కమిటీ చైర్మన్ తాడేం వెంగళ్ రావు

పయనిచేసి సూర్యుడు న్యూస్ జూన్ 3 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి కాశబోయిన మహేష్ అమరవీరుల,త్యాగాలే,తెలంగాణా రాష్ట్ర నిర్మాణానికి పునాధులని చేగుంట మార్కెట్ కమిటీ చైర్మన్ తాడేం వెంగళ రావు అన్నారు. తెలంగాణా అవతరణ దినోత్సవ సందర్భంగా మంగళవారం మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో చైర్మన్ తాడేం వెంగళ్ రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటితో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తయ్యాయని, 2014 జూన్ 2న తెలంగాణ భారతదేశపు 29వ రాష్ట్రంగా అవతరించిందని, ఎన్నో త్యాగాలు, ఉద్యమాలు, ప్రజల ఆకాంక్షల ఫలితంగా ఏర్పడిన ఈ రాష్ట్రం,నేడు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని అన్నారు. తెలంగాణ ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాలు, భాష, కళలను ప్రపంచానికి చాటిచెప్పే రాష్ట్రంగా ఎదుగుతోందని, వ్యవసాయం, విద్య, పరిశ్రమలు, ఐటీ, మౌలిక వసతుల రంగాల్లో మరింత పురోగతి సాధిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ మొహమ్మద్ ముజామిల్, స్టాలిన్ నర్సిములు, అన్నం ఆంజనేయులు, కాషాబోయిన శ్రీనివాస్, బల్ రెడ్డి, పక్కిర్ నాయక్, మొహమ్మద్ రఫీ, కాంగ్రెస్ పార్టి అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *