ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ

పయనించే సూర్యుడు,జూన్ 2 (సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండల ప్రతినిధి: స్వాతి, నర్సిములు): తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జహీరాబాద్ శాసనసభ్యుడు కొనింటి మాణిక్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఆ తర్వాత ఐబీ గెస్ట్ హౌస్ వద్ద బీఆర్ఎస్ పార్టీ జెండాను పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆవిష్కరించారు. కేసీఆర్ చేతిలోనే తెలంగాణ క్షేమం: మాణిక్ రావు ఈ సందర్భంగా మాణిక్ రావు మాట్లాడుతూ.. 14 ఏండ్ల సుదీర్ఘ పోరాటం, విద్యార్థుల ప్రాణ త్యాగాలతోనే తెలంగాణ సిద్ధించిందని, ఉద్యమంలో పాల్గొన్న వేలాది మంది యువకులు, ఉద్యోగులు, రైతుల త్యాగాలు చిరస్మరణీయమని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ నాయకత్వానికే దక్కుతుందని పేర్కొన్నారు. కష్టపడి సాధించిన తెలంగాణను పదేళ్ల పాటు ఇష్టపడి అభివృద్ధి చేసుకున్నామని చెప్పారు. పుట్టిన బిడ్డ తల్లి చేతిలో ఎంత క్షేమంగా ఉంటుందో, తెచ్చిన తెలంగాణ కేసీఆర్ చేతిలో అంతే క్షేమంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని, రైతు సంక్షేమం, సాగునీరు, విద్యుత్, మౌలిక సదుపాయాల కల్పనలో దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం రైతులను మోసం చేస్తూ, సశ్యశ్యామలమైన తెలంగాణను మళ్లీ 50 ఏళ్లు వెనక్కి నెట్టిందని విమర్శించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు, రాష్ట్ర అభివృద్ధి కోసం బీఆర్ఎస్ నిరంతరం ప్రజల, రైతుల పక్షాన పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ప్రతి తెలంగాణ బిడ్డకు గర్వకారణమని పేర్కొన్నారు. పాల్గొన్న ముఖ్య నాయకులు: ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ గుండప్ప, మాజీ ఆత్మ చైర్మన్లు విజయ్ కుమార్, పెంట రెడ్డి, జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు తట్టు నారాయణ, మాజీ మున్సిపల్ చైర్మన్లు అల్లాడి నర్సింలు, తంజీం, సీనియర్ నాయకులు నామ రవికిరణ్, షేక్ ఫరీద్, మాజీ పట్టణ అధ్యక్షుడు యాకూబ్, మొహియుద్దీన్, మాజీ ఆలయ చైర్మన్ వెంకటేశం పాల్గొన్నారు. అలాగే మున్సిపల్ కౌన్సిలర్లు స్రవంతి నామ రవికిరణ్, విజయ రాజు, స్వప్న ప్రవీణ్ కుమార్, సుజిత విశ్వేశ్వర్, ప్రేమలత శంకర్ రెడ్డి, అబ్దుల్లా, దీపక్, జాహెద్, జాకీర్, మహిపాల్, పాండు, ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షుడు శివప్ప, నాయకులు ముర్తుజా, వెంకట్, జగదీష్, అక్తర్, గణేష్, చంద్రయ్య, అక్బర్, శివకుమార్, వేణు గోపాల్, హశం, అలీం, మహమ్మద్ అలీ, ఇబ్రహీం, నరసింహ రెడ్డి, వెంకట్, బీఆర్ఎస్వీ నాయకులు ఫయాజ్, లవణ్, రామ్, యోగేష్, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *