పయనించే సూర్యుడు జూన్ 03, మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ నరిగె కళాశేఖర్: మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం రాయపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మంగళవారం గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం , ప్రాథమిక పాఠశాల ఆవరణలలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ కిష్టారం గాయత్రి మల్లేష్ గౌడ్ అలాగే, స్థానిక ప్రాథమిక పాఠశాల ఆవరణలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్. రంజిత్ కుమార్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ సాధన కోసం ప్రాణాలర్పించిన అమరుల త్యాగాలను వారు స్మరించుకుని ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కిష్టారం గాయత్రి మల్లేష్ గౌడ్, ప్రధానోపాధ్యాయులు ఎన్. రంజిత్ కుమార్, ఉపాధ్యాయురాలు విజయలక్ష్మి, అంగన్వాడీ టీచర్, ఆశా వర్కర్, మాజీ సర్పంచులు, వార్డు మెంబర్లు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, గ్రామస్తులు, పంచాయతీ సిబ్బంది , యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.