పయనించే సూర్యుడు న్యూస్ :జూన్ 4, తల్లాడ రిపోర్టర్ సన్ రైజ్ అభ్యుదయ సేవా సమితి వైరా వారి ఆధ్వర్యంలో ఆ సంస్థ ఉపాధ్యక్షులు ఏనుగు శివ రాఘవ మాతృమూర్తి శ్రీమతి భవాని జన్మదిన సందర్భంగా తల్లాడ మండలం మల్లారం గ్రామం లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన స్కూల్ బ్యాగ్ లు, నోట్ బుక్స్, స్కేల్స్, క్రేయాన్స్, స్కేల్స్, పలకలు మొదలైన సుమారు పదిహేను వేల రూపాయల విలువైన వస్తువులు పంపిణీ చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కల్లూరు మండల పంచాయతీ అధికారి ఏనుగు సురేష్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న చిన్నారులకు విద్యాబుద్ధులు అంకిత భావంతో నేర్పే ఉపాధ్యాయ బృందం ఈ పాఠశాలలో ఉండటం అభినందనీయం అన్నారు. విద్యార్ధులకు అవసరమైన వస్తువులు పంపిణీ చేయటం సంస్థ వారిని సేవలు కూడా ప్రశంసనీయం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ ఖమ్మం జిల్లా కార్యవర్గ సభ్యులు ఏనుగు సుమన్ బాబు మాట్లాడుతూ సర్కారు బడి లో అనుభవం, అర్హత అంకిత భావంతో నేర్పే ఉపాధ్యాయ బృందం ఉంటుంది అని దాన్ని విద్యార్థులు అందిపుచ్చుకొని అభివృద్ధి లోకి వచ్చే విధంగా తల్లిదండ్రులు సహకారం అందించి తోడ్పడాలని కోరారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు మాలతీ దాస్ మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా అందించిన ఈ వస్తువులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ హరి బాబు మాట్లాడుతూ సన్ రైజ్ సంస్థ సేవలు అభినందనీయం అని వారు తమ విద్యార్థులకు పంపిణీ చేసిన వస్తువులు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి, వాటిని సద్వినియోగం అయ్యేలా ఉపయోగిస్తామని తెలుపుతూ సన్ రైజ్ సంస్థ వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల బోధనా, బోధనేతర సిబ్బంది, సంస్థ ప్రతినిధులు ఏనుగు కిరణ్ బాబు, శోభన్ బాబు, మల్లారం గ్రామ పంచాయతీ కార్యదర్శి షేక్ సిద్దిక్మియా, పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.