తిమ్మాయిపాలెం లో అంగన్వాడి పిలుస్తుంది కార్యక్రమం

పయనించే సూర్యుడు జూన్ 4 ( ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) సమగ్ర శిశు సంక్షేమ శాఖ ఆత్మకూరు ప్రాజెక్టు ఆధ్వర్యంలో 1.06.2026 నుండి 20.06.2026 తేదీవరకు అంగన్వాడీ పిలుస్తుంది కార్యక్రమం అంగన్వాడీ కేంద్రాల పరిధిలో నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కేంద్రాలకు హాజరయ్యే 3 నుండి 6 సంవత్సరాల పిల్లల నమోదును పెంచుట కొరకై ఈ కార్యక్రమంలో భాగంగా మూడు సంవత్సరాలు నిండిన పిల్లలందరినీ కూడా అంగన్వాడీ కేంద్రానికి హాజరయ్యేలా తల్లులకు అవగాహన కల్పిస్తూ అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించే కార్యక్రమాల పూర్వ ప్రాథమిక విద్య ఆటపాటల ద్వారా నేర్పించబడునుఅని తల్లిదండ్రులకు క్షుణ్ణంగా వివరించి అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల యొక్క నమోదును పెంచుట కొరకై తగిన చర్యలు తీసుకొనడం జరుగుతుంది అంగన్వాడీ పిలుస్తుంది కార్యక్రమం మండలంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలలో నిర్వహించబడునుదీనిలో భాగంగా ఈరోజు మండలంలోని తిమ్మాయిపాలెం గ్రామంలో అంగన్వాడి పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించి మూడు నుండి పారు సంవత్సరాల పిల్లల ఇండ్లకు వెళ్లి వాళ్ళ తల్లిదండ్రులను తమ పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు పంపించవలెనని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమం నందు సూపర్వైజర్ ఎం పద్మ అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *