పేదలకు సేవ చేయడమే సి.ఆర్.ఫౌండేషన్ లక్ష్యం.

సి.ఆర్.ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు కె.నారాయణ,

పయనించి సూర్యుడు గూడూరు న్యూస్ జూన్ 5 చిల్లకూరు మండల పరిధిలోని పారిచేర్ల వారి పాలెంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త చావా వాసుదేవ రావు కి చెందిన ఎకరా భూమిని సి.ఆర్ ఫౌండేషన్ కు దానం చేశారు.గురువారం ఆ స్థలాన్ని నారాయణ మరియు సి ఆర్ ఫౌండేషన్ సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా సి.ఆర్ ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు కె.నారాయణ విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ మూడు దశాబ్దాల పైగా ప్రారంభించబడిన సి ఆర్ ఫౌండేషన్ అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు తెలియజేశారు. హైదరాబాదులో ఉన్న ఓల్డ్ ఏజ్ హోమ్ దేశంలోనే అత్యంత పేరు ప్రతిష్టలు సంపాదించి 150 మంది సీనియర్ సిటిజనులకు నిలయంగా ఉందన్నారు. సి ఆర్ ఫౌండేషన్ తరపున ఒక మహిళ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, మరియు సిఆర్ పాలి క్లినిక్ , ఎన్ ఆర్ ఆర్ రీసెర్చ్ సెంటర్, విశాలమైన గ్రంథాలయం, తదుపరి కార్యకలాపాలు విజయవంతంగా నడుస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే గుంటూరులో నాలుగు ఎకరాల్లో విస్తీర్ణంలో సి ఆర్ ఫౌండేషన్ పేరుతో ఓల్డ్ ఏజ్ హోమ్, ఆర్ఫన్స్ చిల్డ్రన్ హోం నిర్మించబోతున్నట్లు తెలిపారు. కడపలో మూడు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన హోమ్ నీ వచ్చే నెల నుంచి ప్రారంభించడం జరుగుతోంది. ఈ సందర్భంగా గూడూరులో చావా వాసుదేవరావు దాతృత్వంలో, వాళ్ల సతీమణి, కుమారుడు చావాహర్షవర్ధన్ పేరుతో సి ఆర్ ఫౌండేషన్ అనుబంధంగా. ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కే.నారాయణ , వాసుదేవరావు వాళ్ల కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు.ఈ సమావేశంలో cr ఫౌండేషన్ సభ్యులు పి పావని, బి కే ఎం యు రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్ ప్రభాకర్, సిపిఐ గూడూరు నియోజకవర్గ కార్యదర్శి జి శశికుమార్, చిలుకూరు మండల కార్యదర్శి జి రమేష్,గూడూరు నగర కన్వీనర్ సునీల్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *