పయనించే సూర్యుడు న్యూస్, జూన్ 05 (ఏలేశ్వరం మండల రిపోర్టర్ ఏ శివాజీ) : పట్టణంలోని తల్లిదండ్రులు లేని 20 మంది పేద విద్యార్థులకు లింగంపర్తి గ్రామానికి చెందిన బొగత నారాయణరావు(మిలట్రీ మ్యాన్) పుట్టినరోజు సందర్భంగా నారాయణ, సుగుణ దంపతుల ఆర్థిక సాయంతో విద్యార్థులకు వివేకానంద సేవా సమితి అధ్యక్షుడు మైరాల నాగేశ్వరరావు సూచనల మేరకు సభ్యుల ఆధ్వర్యంలో గురువారం నోట్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో వివేకానంద సేవా సమితి ఏలేశ్వరం ఇంచార్జ్ పెండ్యాల రాజు, సభ్యులు ఎస్.మల్లిబాబు, డోర్ షాప్ రమేష్, ఇమిడిసెట్టి కృష్ణ,పెండ్యాల రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.