తల్లిదండ్రుల జ్ఞాపకార్థం సేవా కార్యక్రమం

* గ్రామ పంచాయతీ సిబ్బందికి దుస్తులు పంపిణీ * పంపిణీ చేసిన మాజీ ఉప సర్పంచ్ ఉగ్గె కుమార్

పయనించే సూర్యుడు న్యూస్ : పెద్దపల్లి, సెంటినరీ కాలనీ-05 సమాజ సేవ పట్ల తనకున్న నిబద్ధతను మరోసారి చాటుతూ రాజాపూర్ గ్రామ మాజీ ఉప సర్పంచ్ ఉగ్గె కుమార్ తన తల్లిదండ్రులు కీ.శే. ఉగ్గె శంకరమ్మ – వెంకటయ్య ర జ్ఞాపకార్థం గ్రామ పంచాయతీ సిబ్బందికి మరియు కారోబార్‌కు దుస్తులను పంపిణీ చేశారు. తన మాతృమూర్తి శంకరమ్మ గారి 6వ వర్ధంతి సందర్భంగా ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఉగ్గె కుమార్ మాట్లాడుతూ, తన తల్లిదండ్రులు ఎల్లప్పుడూ సేవాభావంతో జీవించారని, వారి ఆశయాలను కొనసాగించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. గ్రామ అభివృద్ధి మరియు ప్రజల సంక్షేమం కోసం తన వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని పేర్కొన్నారు. గ్రామ సర్పంచ్ పుల్లెల భాగ్యలక్ష్మి – కొమరయ్య మాట్లాడుతూ,తల్లిదండ్రుల జ్ఞాపకార్థం గ్రామ పంచాయతీ సిబ్బందిని గౌరవించడం అభినందనీయమని అన్నారు.గతంలో కూడా ఉగ్గె కుమార్ గ్రామ పంచాయతీకి కుర్చీలు అందజేసి గ్రామాభివృద్ధికి సహకరించిన విషయాన్ని గుర్తుచేశారు.కార్యక్రమంలో పాల్గొన్న పలువురు గ్రామ పెద్దలు, నాయకులు ఉగ్గె కుమార్ సేవా కార్యక్రమాలను ప్రశంసిస్తూ, యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పుల్లెల భాగ్యలక్ష్మి–కొమరయ్య, వార్డు సభ్యులు పుల్లెల సుజాత–సతీష్, కన్నూరి శశికుమార్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కాల్వ శ్రీనివాస్, నాయకులు మాటేటి రవి, పుట్ట సంతోష్, ఉగ్గె కొమురయ్య, నవీన్, ప్రశాంత్, పుల్లెల వెంకటయ్య, ఉగ్గె లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *