పెద్ద శంకరంపేట లో కార్గో సేవలు పునః ప్రారంభం

పయనించే సూర్యుడు జూన్ 6 పెద్ద శంకరంపేట్ మండలం మెదక్ జిల్లా (రిపోర్టర్ జిన్న అశోక్) ఆర్ టి సి కార్గో సేవలు పెద్ద శంకరం పేట లో చాలా రోజుల విరామం తర్వాత తిరిగి పునః ప్రారంభం అయ్యాయి నారాయణఖేడ్ డిపో మేనేజర్ సుబ్రమణ్యం చేతుల మీదుగా తిరిగి కార్గో సేవలు ప్రజలకు అందుబాటులోకి రావడం హర్షణీయం రాష్ట్ర అర్చక సంఘం ఉపాధ్యక్షులు స్థానిక పురోహితులు గుడి చంద్ర శేఖర్ ఈ కార్యక్రమం లో పాల్గొని కార్గో సేవలను కొనియాడారు ఉమ్మడి మెదక్ జిల్లా లో ఎక్కడికైనా పార్శిల్ లను ఒకే రోజులో కస్టమర్ కు చేరేలా కార్గో మరింత వేగవంతమైన సేవలను ప్రజల సమీపం లోకి తీసుకొనికోరావాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమం లో ఆర్ యం ఈ శ్రీనివాస్ డియం ఇ రవీందర్ పెద్ద శంకరంపేట్ కార్గో ఏజెంట్ కండగట్ల రాజేష్ ప్రముఖ వేద పండితులు గుడి శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *