మొక్కలు నాటి..పర్యావరణాన్ని పరిరక్షించాలిబీజేపీ మానకొండూర్ అసెంబ్లీ నియోజకవర్గ జాయింట్ కన్వీనర్ బత్తిని స్వామిగౌడ్,

పయనించే సూర్యుడు న్యూస్:జూన్/06:నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి:సాయిరెడ్డి బొల్లం:రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం రహీంఖాన్ పేట గ్రామం లోని ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటారు. ప్రజలందరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని రక్షించుకోవాలి. పర్యావరణం బాగుంటేనే మానవ మనుగడ సాధ్యం. ప్రకృతి మనకు అమూల్యమైన వరంమని,చెట్లు, నీరు, గాలి ,వంటి వనరులను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతని బీజేపీ మానకొండూర్ నియోజకవర్గ జాయింట్ కన్వీనర్ బత్తిని స్వామిగౌడ్, అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రహీంఖాన్ పేట 292,293 బూతులలో గ్రామ ప్రజలతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా బత్తిని స్వామిగౌడ్, మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు మన వంతు కృషి చేస్తూ, భావి తరాలకు స్వచ్ఛమైన హరిత భవిష్యత్తును అందిద్దామన్నారు. ప్రాణుల మనుగడకు ప్రకృతే ఆధారమని, అడవుల నరికివేతను అడ్డుకుందాం.. పచ్చదనం పెంచి పర్యావరణాన్ని రక్షించుకుందామని పేర్కొన్నారు. మొక్కలు పెంచి పర్యావరణాన్ని పరిరక్షిస్తేనే మానవ మనుగడ సాధ్యమని అన్నారు. ప్రజలందరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బత్తిని సాయి గౌడు, బొల్లం రాజు, జెట్టి హరికృష్ణ, జెట్టి రాజు, జెట్టి రామస్వామి, చక్రాల దుర్గయ్య, తాడూరి కనకయ్య, తొత్తుల ఎల్లయ్య, కంఠం అజయ్ బిజెపి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *