జడ్చర్ల సీఎం సభకు గుడ్లనర్వ మహిళల తరలింపు

​ పయనించే సూర్యుడు జూన్ 6 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ జడ్చర్ల పట్టణంలో నిర్వహించనున్న ముఖ్యమంత్రి బహిరంగ సభకు బిజినపల్లి మండల పరిధిలోని గుడ్లనర్వ గ్రామ మహిళా సంఘాల సభ్యులు ఉత్సాహంగా బయలుదేరి వెళ్లారు. గ్రామ సంఘాల (వివో) ప్రతినిధులు శారద, విజయల నేతృత్వంలో సుమారు 40 మంది మహిళా సభ్యులు ప్రత్యేక వాహనంలో సీఎం సభకు తరలివెళ్లారు. ​ఈ సందర్భంగా మహిళా ప్రతినిధులు మాట్లాడుతూ.. ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి, స్వయం సహాయక సంఘాల బలోపేతానికి అందిస్తున్న చేయూతకు కృతజ్ఞతగా తామంతా ఈ సభకు తరలివెళ్తున్నట్లు పేర్కొన్నారు. సీఎం ప్రసంగాన్ని వినేందుకు, ప్రభుత్వ పథకాలపై మరింత అవగాహన పెంచుకునేందుకు మహిళలు పెద్ద ఎత్తున తరలిరావడంతో గ్రామంలో కోలాహలం నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *